సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 వేడుకల్ని వచ్చే సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్ లో నిర్వహించాలని (SIIMA) కమిటీ నిర్ణయించింది. సౌత్ ఇండియా సినిమాల్లోని టాలెంట్ ను గుర్తించి అవార్డులు అందజేసే ఈ ప్రోగ్రాంకు ఆటోమొబైల్ సంస్థ నెక్సా స్పాన్సర్ గా ఉండనుంది. ఈ అవార్డ్ ఫంక్షన్స్ గత 11 సంవత్సరాలు నిర్వహిస్తుండగా… ఈసారి దుబాయ్ వేదికగా వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు చేయడానికి రెడీ అవుతున్నామని సైమా ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్ తెలిపారు.