అసలు పాలిటిక్స్ లోకే రావడం లేదని అలాంటప్పుడు పోటీ చేయబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. గోషామహల్ నుంచి పోటీకి దిగుతున్నానన్న ప్రచారం సరికాదని స్పష్టం చేశారు. తనను ఏ పొలిటికల్ పార్టీ సంప్రదించలేదని, అన్ని పార్టీలు, అందరు నాయకులు గౌరవమేనన్నారు. ‘నేను ఒక ఆర్టిస్ ను.. అందర్నీ ఎంటర్టెయిన్ చేయడమే నా పని.. నేను పాలిటిక్స్ లోకి రావట్లేదు’ అంటూ సిప్లిగంజ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు దృష్టంతా మ్యూజిక్ కెరీర్ పైనే ఉందన్నారు.