తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న కమల్ హాసన్ తీరుతో కన్నడనాట మొదలైన వేడి.. ఆయన సినిమా ‘థగ్ లైఫ్(Thug Life)’ను నిషేధించేదాకా వెళ్లింది. దీనిపై మండిపడ్డ సుప్రీం.. సినిమాను ఆపొద్దని తీర్పునిచ్చింది. ఏం జరిగిందంటే… జూన్ 5న విడుదల కావాల్సిన ఈ మూవీని.. కమల్ క్షమాపణ చెప్పేవరకు రద్దు చేస్తున్నట్లు కన్నడ థియేటర్లు సహా ఫిలిం ఛాంబర్(KFCC) ప్రకటించాయి. దీంతో కర్ణాటక హైకోర్టును కమల్ ఆశ్రయించగా.. ఆయనకు షాక్ ఇస్తూ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. దీన్ని సుప్రీంలో ఛాలెంజ్ చేశారాయన. బెదిరింపులకు పాల్పడితే చర్యలు తీసుకోవడం మీ విధి అంటూ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక హైకోర్టుకు స్పష్టం చేసింది. CBFC అనుమతి ఉన్న సినిమాను ఎవరైనా విడుదల చేసుకోవచ్చంటూ విస్పష్ట తీర్పునిచ్చింది.