
హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ నటించిన ‘టక్కర్’ మూవీ గత నెలలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద్ మెప్పించలేకపోయింది. కార్తిక్ జి. దర్శకత్వం వహంచిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే రిలీజ్‌కు ముందు టీజర్, ట్రైలర్లో బోల్డ్ కంటెంట్‌తో హైప్ క్రియేట్ చేసుకున్న టక్కర్ మూవీ.. రిలీజ్ తర్వాత ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. స్ట్రీమింగ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

‘టక్కర్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్.. తమిళ్, తెలుగు భాషల్లో జూలై 7 నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇక ఈ చిత్రంలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్, ఆర్జే విఘ్నేష్‌కాంత్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా ఈ చిత్రానికి నివాస్ కె. ప్రసన్న సంగీతం అందించారు.
ఇదిలా ఉంటే.. ‘టక్కర్’ కంటే ముందు ఆర్ఎక్స్100 డైరెక్టర్ అజయ్ భూపతితో ‘మహా సముద్రం’ మూవీలో నటించారు సిద్ధార్థ్. మల్టిస్టారర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ మరొక హీరో. ఈ మూవీ సైతం ఫ్లాప్ అవగా.. ఇందులో హీరోయిన్గా నటించిన అదితి రావు హైదరీతో ప్రస్తుతం డేటింగ్లో ఉన్నాడు సిద్ధార్థ్.