
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న తమన్నా భాటియా.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవలే ఆమె నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’ ఆంథాలజీ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇటీవలే ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న మిల్కీ బ్యూటీ.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంది. వారు చాలా గౌరవంగా ఉంటారని.. పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన రామ్ చరణ్, నాగ చైతన్య వంటి హీరోలు సైతం మర్యాదగా ప్రవర్తిస్తారని చెప్పింది.

ఇక తాను నేను పెద్ద స్టార్‌ని అవుతానని మొదట చెప్పింది మెగాస్టార్ చిరంజీవి అని ఈ సందర్భంగా వెల్లడించింది తమన్నా. రామ్ చరణ్‌తో ‘రచ్చ’ సినిమా చేస్తున్నప్పుడే ఈ మాట అన్నారని, అప్పటికి తానింకా స్టార్‌ను కాలేదని గుర్తుచేసుకుంది. ఇక సెట్స్‌లో రామ్ చరణ్ లేదా నాగ చైతన్య తోటి నటులను రెస్పెక్ట్ ఇస్తారని, సంస్కారంతో మెలుగుతారని చెప్పింది. వాళ్లను చూస్తుంటే చిరంజీవి, నాగార్జున వంటి లెజెండ్స్ తమ అబ్బాయిలను చాలా బాగా పెంచారని అనిపించేదని తెలిపింది. ఇక సెట్లో ఉన్న మహిళలను కంఫర్టబుల్‌గా చూసుకునే వారిలో చిరంజీవి సర్ కూడా ఒకరని అభిప్రాయపడింది.
ఇదిలా ఉంటే.. తన అప్‌కమింగ్ ఫిల్మ్ ‘జైలర్’లో రజనీకాంత్‌తో కలిసి నటించింది తమన్నా. షూటింగ్ సెట్లో రజినీ ఆమెకు ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారట. మొత్తం మీద ఈ స్టార్లు సూపర్స్టార్లు మాత్రమే కాదనే విషయాన్ని గ్రహించానన్న తమన్నా.. వారు మనుషులను మనుషుల్లానే ట్రీట్ చేస్తారని గొప్పగా చెప్పుకొచ్చింది.