భారతీయుడు-2 మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్(Single Screen) థియేటరల్లో రూ.50 చొప్పున, మల్టీప్లెక్సుల్లో రూ.75 వరకు పెంచుకోవచ్చని తెలిపింది. ఈనెల 12 నుంచి 19 వరకు టికెట్ల ధరలు పెంచుకోవాలని సూచించింది.
ఈనెల 12 నుంచి…
1996లో వచ్చిన ‘భారతీయుడు’కి సీక్వెల్ గా వస్తున్న ‘భారతీయుడు-2’.. ఎల్లుండి(ఈనెల 12న) రిలీజ్ అవుతున్నది. లంచగొండులపై ఏ మాత్రం కనికరం చూపని పాత్రతో కమల్ హాసన్ అప్పట్లో ఉర్రూతలూగించారు. ఇప్పుడు ‘భారతీయుడు-2’పైన అవే అంచనాలుండగా.. ఐదో షో(Fifth Show)ను వారం రోజుల పాటు నడిపేందుకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డ్రగ్స్ పై…
ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలనుకునే సినిమాల్లో.. డ్రగ్స్ వాడకం వల్లే కలిగే నష్టాలను ముందుగా ప్రదర్శించాలని CM రేవంత్ రెడ్డి చెప్పిన మాటతో.. ఇప్పుడు ‘భారతీయుడు-2’ టీమ్ అదే పనిలో ఉంది. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్లో భాగంగా కమల్ హాసన్, సిద్ధార్థ, సముద్రఖని, దర్శకుడు శంకర్ షణ్ముగం పాల్గొంటూ చిత్రీకరణ చేస్తున్నారు.