తెలుగు సినీ గేయ రచయిత(Lyricist) కులశేఖర్ కన్నుమూశారు. ‘చిత్రం’, ‘నువ్వునేను’, ‘మనసంతా నువ్వే’, ‘వసంతం’ వంటి హిట్ చిత్రాలకు పాటలు(Songs) రాశారు. డైరెక్టర్ తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ తో కలిసి మంచి పాటల్ని అందించారు. 100 సినిమాలకు పైగా పాటలు అందించిన కులశేఖర్ తొలుత సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేశారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించి అదే మూవీతో భారీ హిట్ కొట్టారు. 2008లో అతడు మెదడుకు సంబంధించిన వ్యాధికి గురై మతిస్థిమితం కోల్పోయారు. కులశేఖర్ ది సింహాచలం కాగా.. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.