తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి(కృష్ణప్రసాద్) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన.. గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు వెళ్లి చూసేసరికి నిర్జీవంగా కనిపించారు. 2016లో సినీ రంగంలో ప్రవేశించిన కృష్ణప్రసాద్.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమా తెలుగు వెర్షన్ కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం వంటి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. హైదరాబాద్ లోని డ్రగ్స్ కేసులో ఆయన నిందితుడు.