తొమ్మిది నెలల క్రితం విడుదలై దేశవ్యాప్తంగా వివాదాలకు, సంచలనాల(Sensational)కు కేంద్ర బిందువుగా మారిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా.. ఇన్నాళ్లకు OTTల్లోకి అడుగుపెడుతున్నది. విడుదల సమయంలోనే వివాదమయంగా మారిన ఈ చిత్రం.. భారీగా వసూళ్లు(Collections) రాబట్టింది. ఆదా శర్మ కీలక పాత్రలో శాలిని ఉన్నికృష్ణన్ ఫాతిమాబా గా మారిన వైనంపై సినిమా కథ నడిచింది. హిందూ మలయాళీ నర్స్ కాస్తా ఫాతిమాబా గా మారిన తర్వాత ISISలో చేరుతుంది. అఫ్గానిస్థాన్ లో ఐసిస్ ఉగ్రవాదులతో జరిగిన పరిణామాలను వివరించడమే లక్ష్యంగా కథ సాగింది. యోగితా బిహాని, సిద్ధి ఇగ్నాని, సోనియా బలాని, ప్రణయ్ పచౌరి, విజయ కృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ నెల 16న OTTలో…
‘ది కేరళ స్టోరీ’ ఈనెల 16న ఓటీటీలోకి అడుగుపెడుతున్నది. గత ఏడాది మే 5న విడుదలై(Release)న ఈ మూవీ.. ఎట్టకేలకు తొమ్మిది నెలలకు OTTలోకి ప్రవేశిస్తున్నది. ‘ది కేరళ స్టోరీ’ని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు జీ5 ప్రకటించింది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటున్నట్లు జీ5 యాజమాన్యం తెలిపింది. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించిన ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకుడు. హిందూత్వ సిద్ధాంతంతో లవ్ జిహాద్ తీరును వివరిస్తూ తీసిన ‘ది కేరళ స్టోరీ’.. ప్రపంచవ్యాప్తం(Worldwide)గా 303.97 కోట్లు రాబట్టింది. 2023లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తొమ్మిదో మూవీగా ‘ది కేరళ స్టోరీ’ రికార్డ్ క్రియేట్ చేసింది.
విమర్శలు, ప్రశంసలు…
‘ది కేరళ స్టోరీ’కి హిందూత్వ వాదుల నుంచి పెద్దయెత్తున ప్రశంసలు లభిస్తే ఇందులోని క్యారెక్టర్ల తీరుపై భారీగానే విమర్శలు వచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో ఈ మూవీ గురించి భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. మరోవైపు కేరళలో 32,000 మంది అమ్మాయిలు అదృశ్యం కావడం ఆధారంగా ‘ది కేరళ స్టోరీ’ కథ సాగింది.
Published 07 Feb 2024