ఎఫ్-2, ఎఫ్-3 ద్వారా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నది. తెలుగు ఇండస్ట్రీ(Tollywood)లో క్రేజీ జోడీగా మారిన వెంకీ-అనిల్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ మూవీలో ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్ లో నటించనున్నారన్న వార్తలు వినపడుతున్నాయి.
జులై 3న(రేపు) ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుండగా.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజా సినిమాకు సంబంధించిన కీలక(Key) అప్డేట్ ను చిత్ర యూనిట్ అందించింది. మూవీ రెగ్యులర్ షూటింగ్ సైతం ఈ వారంలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
‘ఎక్సలెంట్ వైఫ్.. ఎక్స్ కాప్.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్..’ మధ్య జరిగే కథతో ట్రయాంగిల్ ఎంటర్టయినర్ గా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందులో మరో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ నటించే ఛాన్స్ ఉండగా.. ఇతర నటీనటులు, సాంకేతిక(Technical) నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.