ఒకప్పుడు తెలుగు సినిమా అంటే.. ఈ ఫైట్లు ఏంట్రా బాబూ అనుకునేవారు. కథకు సంబంధం లేకుండా పాటలు, ఫైట్లతోనే నడిపిద్దామని మూవీలు తీసేవారు. కానీ గత కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీ(Tollywood) పూర్తిగా మారిపోయింది. బాహుబలితో ప్రపంచస్థాయిలో స్టార్ డమ్, RRRతో ఆస్కార్ అవార్డులతో టాలీవుడ్ స్థాయి హాలీవుడ్ ను మించిపోయింది. ఫస్ట్ డే కలెక్షన్లు వందల కోట్లు వసూలవుతూ రికార్డు సృష్టిస్తున్నాయి మన సినిమాలు.
ఆ ఇద్దరివే…
దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 సినిమాలు RRR, బాహుబలి-2, కల్కి 2898 AD, సలార్, KGF(కన్నడ), లియో(తమిళ్), జవాన్(హిందీ), ఆదిపురుష్, సాహో వంటివి ఉన్నాయి. ఇందులో ప్రభాస్, రాజమౌళివే ఎక్కువ ఉన్నాయి. ప్రభాస్ మూవీలు ఐదు కాగా.. బాహుబలి-2, కల్కి 2898 AD, సలార్, ఆదిపురుష్, సాహో రికార్డులు సృష్టించాయి.
రాజమౌళివి…
బాహుబలితో భారత సినీ చరిత్రను తిరగరాసిన ఎస్.ఎస్.రాజమౌళి… తన రెండు సినిమాలు(బాహుబలి-2, RRR) టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. ఇలా ఆరు టాలీవుడ్ సినిమాలు టాప్-10లో నిలవడం మన ఘనకీర్తిని చాటుతున్నది.
టాప్-10 సినిమాలు ఇవే…
ర్యాంక్ | మూవీ | కలెక్షన్లు (రూపాయల్లో) |
1 | RRR | 210 కోట్లు |
2 | బాహుబలి 2 | 200 కోట్లు |
3 | కల్కి 2898 AD | 191.5 కోట్లు |
4 | సలార్ | 178.7 కోట్లు, |
5 | కేజీఎఫ్-2(కన్నడ) | 160 కోట్లు |
6 | లియో(తమిళం) | 148.5 కోట్లు |
7 | ఆదిపురుష్ | 140 కోట్లు |
8 | సాహో | 130 కోట్లు |
9 | జవాన్(హిందీ) | 129.6 కోట్లు |
10 | యానిమల్(హిందీ) | 116 కోట్లు |