
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. హీరోయిన్ పూజా హెగ్డేను రెండు సినిమాల్లో కంటిన్యూ చేశారు. ముందు ‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ పక్కన నటించిన పూజ.. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ మూవీలో బన్నీతో జోడీ కట్టింది. ఇలా వరుసగా రెండు ఛాన్స్‌లు ఇచ్చిన త్రివిక్రమ్.. గుంటూరు కారం చిత్రంలో మహేష్ పక్కన తననే హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. కానీ అనివార్య కారణాల వల్ల పూజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాలో త్రివిక్రమ్ ఆమెను ఫిమేల్ లీడ్‌గా తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తోంది.
‘గుంటూరు కారం’ మూవీలో పూజ స్పెషల్ సాంగ్ చేయడం లేదని తెలుస్తుండగా.. సంపత్ నంది దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో తనను ఫిమేల్ లీడ్‌గా తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు నిర్మాతల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరని టాక్. ఈ నేపథ్యంలోనే మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రంలో సాయిధరమ్‌కు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.