బాలీవుడ్ నటి(Actress) శిల్పాశెట్టి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పెద్దయెత్తున ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె నివాసంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. తల్లి సునంద శెట్టి, భర్త రాజ్ కుంద్రా, పిల్లలు వియాన్, సమీషాతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో ఆమె పాదరక్షలు(Foot Wear) ధరించడం వివాదానికి కారణమైంది. దీనిపై పెద్దయెత్తున ట్రోల్స్(Trolls) ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా చెప్పులతో జెండాను ఎగురవేయడం జాతీయ పతాకాన్ని అగౌరవపరచడమేనని ట్రోల్ చేశారు.