“ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్.. ట్రోల్స్ లో చిక్కుకుంటున్నాడు. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ పై విపరీతమైన ట్రోల్స్ ఎదురవుతున్నాయి. ఓం రౌత్ ను విమర్శిస్తూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్న ట్వీట్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. ఆదిపురుష్ లోని సీన్స్ ను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ నెటిజన్లు చేస్తున్న మీమ్స్ వైరల్ అవుతున్నాయి. 20 ఏళ్ల క్రితం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా అంజి విజువల్ ఎఫెక్ట్ ను గుర్తుచేస్తూ ఆ మూవీలోని సీన్స్ ను పెట్టి మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ కంటే కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన అంజి vfx బాగున్నాయని పోస్ట్ చేస్తున్నారు. చిరు మరో సినిమా ఆచార్యను సైతం ఆదిపురుష్ ట్రోల్స్ కు వాడుకుంటున్నారు. రామాయణ గాథతో మైథలాజికల్ మూవీగా తయారైన “ఆదిపురుష్’… రూ.500 కోట్ల బడ్జెట్ తో తయారైన సంగతి తెలిసిందే. పౌరాణిక గాథకు లేటెస్ట్ విజువల్స్ జోడించి తయారు చేసిన సినిమాలో విజువల్స్ చూసి సినీప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారీస్థాయి విజువల్స్ తో రామాయణాన్ని తీర్చిదిద్దారని ప్రశంసలు వెల్లువెత్తినా.. రాముడుగా ప్రభాస్ నటన, పాటలు పాజిటివ్ నెస్ ను తీసుకువచ్చినా.. విజువల్ ఎఫెక్ట్స్ పైనే తీవ్ర చర్చ జరుగుతోంది.