కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ అప్‌కమింగ్ మూవీ ‘మావీరన్’. తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో జులై 14న విడుదలవుతోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్ కథాంశంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించింది. అయితే ఈ మూవీపై ఇప్పటికే నెలకొన్న అంచనాలకు తోడు మరో అప్డేట్ ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది. అదేంటంటే.. మాస్ మహరాజ్ రవితేజ, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. ఎలాగంటే.. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వీరిద్దరూ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.
‘మహావీరుడు’ తమిళ వెర్షన్‌కు విజయ్ సేతుపతి, తెలుగులో రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని శివ కార్తికేయన్ అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఈ ముగ్గురిలోనూ ఒక కామన్ పాయింట్ ఉండటం విశేషం. తెలుగులో రవితేజ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. తమిళ్లో విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్ది ఇదే స్టోరీ. కాబట్టి ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్వశక్తి శాంతి టాకీస్ నిర్మించిన ‘మహావీరుడు’ చిత్రంలో సీనియర్ నటి సరిత, మిస్కిన్, అదితి శంకర్, యోగి బాబు, మోనిషా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందించగా.. భరత్ శంకర్ సంగీతం సమకూర్చారు.