‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ నందించిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. తాజాగా మరో మూవీలోనూ పవన్ ను న్యూ లుక్స్ తో చూపించబోతున్నారు. పవన్, హరీశ్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు సంబంధించిన తాజా షెడ్యూల్ నేటి(సెప్టెంబరు 5) నుంచి స్టార్ట్ అవుతున్నట్లు యూనిట్ వర్గాలు సోషల్ మీడియాతో పంచుకున్నాయి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగినట్లుగానే ఇప్పటికే రిలీజయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పవన్ బర్త్ డే అయిన సెప్టెంబరు 2 నాడు వదిలిన పోస్టర్ కూడా బాగా అట్రాక్ట్ చేసింది.
‘ఉస్తాద్’ సినిమాలో పవన్ కల్యాణ్ ను ఇంతకుముందెన్నడూ లేని రీతిలో పూర్తి మాస్ లుక్స్ లో చూపించబోతున్నారు. ఇందులో ఆయన సరసన శ్రీలీల, సాక్షి వైద్య ఫిమేల్ లీడ్ లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ మూవీలో KGF ఫేమ్ అవినాశ్, నవాబ్ షా, గౌతమి, నాగ మహేశ్ వంటి వారు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్న ఈ మూవీని 2024లో రిలీజ్ చేసే అవకాశముంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ను నిర్మిస్తున్నారు.