కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ లో హీరో వరుణ్ సందేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఫైట్ సీన్ తీస్తుండగా కాలికి బలమైన గాయం కావడంతో 3 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. జాగృతి మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మాణమవుతున్న’కానిస్టేబుల్’ మూవీని అర్థంతరంగా నిలిపివేయాల్సి వచ్చిందని డైరెక్టర్ ఆర్యన్ శుభాన్ తెలిపారు. పూర్తి పల్లెటూరి వాతావరణంలో తీస్తున్న ఈ మూవీలో ఒక కానిస్టేబుల్ జీవిత గాథ చుట్టూ కథ తిరుగుతుంది. ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి కాగా.. వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.
వరుస హిట్లతో యూత్ లో క్రేజ్
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘హ్యా పీ డేస్’తో 2007లో వరుణ్ సినీ కెరీర్ మొదలైంది. తర్వాతి ఏడాది విడుదలైన ‘కొత్త బంగారు లోకం’ మూవీ యూత్ లో క్రేజ్ ని క్రియేట్ చేసింది. అలా వరుస రెండు బంపర్ హిట్లతో ఇండస్ట్రీలో తన స్థానాన్ని వరుణ్ పదిలం చేసుకున్నాడు. ‘కుర్రాడు’… ‘ఏమైంది ఈ వేళ’… ‘డీ ఫర్ దోపిడీ’… ‘పాండవులు పాండవులు తుమ్మెద’… ‘మామ మంచు అల్లుడు కంచు’… ‘మైఖేల్’ సినిమాలతో అలరించాడు. తెలుగు టీవీ రియాల్టీ షో ‘బిగ్ బాస్-3’ లో పాల్గొన్న వరుణ్ సందేశ్.. ఫోర్త్ ప్లేస్ లో నిలిచాడు.