రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన మంచి ఫ్రెండ్స్ అని తెలిసిందే. ఇద్దరు కలిసి ఇప్పటికే రెండు సినిమాల్లో జంటగా నటించారు. ఇదే కాంబినేషన్లో మరో సినిమా కోసం ఇరువురి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే చూద్దాం అంటూ ప్రతిసారి మాట దాటవేస్తున్న విజయ్, రష్మిక.. వెకేషన్స్‌కు వెళ్లినా జంటగా కనిపించకుండా జాగ్రత్తపడుతుంటారు. అయినప్పటికీ నెటిజన్లు మాత్రం ఆధారాలతో సహా చూపించి ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ప్రూవ్ చేస్తుంటారు. కానీ దీనిపై ఎటువంటి అఫిషియల్ సమచారం లేదు. అయితే వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఫిదా అయిన ఫ్యాన్స్.. రియల్ లైఫ్‌లోనూ ఒక్కటి కావాలిని కోరుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఈ జంట ఓ కేఫ్‌లో కెమెరాకు చిక్కగా.. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే ఈ వీడియోలో విజయ్, రష్మికతో పాటు ఆనంద్ దేవరకొండ, VD12 డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సైతం ఉన్నారు. చూస్తుంటే ఇది క్యాజువల్ మీట్ లాగే ఉంది. నిజానికి రష్మికకు విజయ్ ఫ్యామిలీతోనూ మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్లింట్లో జరిగే ఫంక్షన్లకు సైతం గతంలో తను హాజరైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రష్మిక ప్రస్తుతం హిందీలో ‘యానిమల్’ మూవీతో పాటు తెలుగులో ‘పుష్ప2’ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు విజయ్ ‘ఖుషి’, VD12 చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటిలో ఖుషి చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది.