
ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు థియేటర్లలో ఆడియన్స్ ను మెప్పించక చతికిలపడుతున్నాయి. కానీ అవే మూవీస్ OTTల్లోకి వచ్చేసరికి దుమ్ము రేపుతున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకే చేరింది ‘విమానం’ మూవీ. స్మాల్ బడ్జెట్ సినిమా అయిన విమానం… OTTలో సంచలనం క్రియేట్ చేసేలా దూసుకుపోతోంది. శివ ప్రసాద్ యానాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను… తొమ్మిది రోజుల్లోనే 50 మిలియన్ల మంది వీక్షించారు. ఈ స్థాయిలో స్ట్రీమింగ్ నమోదు కావడం పట్ల ప్రొడక్షన్ యూనిట్ ఆశ్చర్యానికి గురవుతోంది.
గత నెల 9న రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా… ఆడియన్స్ నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ… ZEE 5లో స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 30 నుంచి ఇది OTTలో స్ట్రీమింగ్ అవుతుండగా… ఈ 10 రోజుల్లోనే 50 మిలియన్ల(Millions) వ్యూయర్ షిప్ తో రికార్డులు క్రియేట్ చేస్తోంది.