పహల్గామ్ ఉగ్రదాడితో పర్యాటకులు(Tourists) లేక కళ తప్పిన కశ్మీర్ లోయ.. అమర్ నాథ్ యాత్రతో పునరుజ్జీవం పొందనుంది. జులై 3న మొదలయ్యే యాత్ర ఆగస్టు 9 వరకు 38 రోజుల పాటు సాగుతుంది. రోజుకు 15 వేల మంది మాత్రమే దర్శించుకోనుండగా, ఏప్రిల్ 14 నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. గతేడాది 52 రోజుల పాటు సాగితే ఈసారి యాత్రను 38 రోజులకు కుదించారు. ఈ నెల 8 నాటికే 3.31 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా, మొత్తంగా 5 లక్షల మందికి పైగా వస్తారన్నది అంచనా. 50 వేల మంది CRPF, ఇతర కేంద్ర బలగాలు, కశ్మీర్ పోలీసులు భద్రతనిస్తారు. ఈ లెక్కన ప్రతి ఐదుగురు భక్తులకు ఒక జవాన్ ఉంటారన్నమాట.