అయోధ్య రాములవారి దర్శనంలో రద్దీ నియంత్రించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 80 మీటర్ల పొడవు గల సొరంగాన్ని(Under Ground Tunnel) సిద్ధం చేసింది. ఆలయంలోకి ప్రవేశించేవారు, ప్రదక్షిణ చేసుకున్న భక్తుల మధ్య ఇబ్బంది తలెత్తకుండా ఈ జాగ్రత్తలు చేపట్టింది. నేల మట్టానికి 15 అడుగుల లోపల ఒకేసారి లక్షన్నర మంది ప్రదక్షిణ చేసుకునేలా సొరంగం తయారైంది. అక్టోబరు నాటికి సొరంగం పనులు పూర్తవుతాయని నిర్మాణ సంస్థ L&T అధికారులు తెలిపారు. ప్రదక్షిణ కోసం నిర్మించే 800 మీటర్ల గోడలో భాగంగా సొరంగం తవ్వాలన్నది ప్లాన్. 2.7 ఎకరాల్లో నిర్మితమైన రామ మందిరం.. 2024, జనవరి 22న ప్రారంభమైంది.