మీ ఇంట్లో చీపురు విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు. చీపురు(Broom Stick) వాడకం(Uses)లో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఎందుకంటే.. చీపురును మహాలక్ష్మీకి స్వరూపంగా చెబుతారు. అలాంటి చీపురును ఏ రోజు పడితే అప్పుడు కొని ఇంటికి తీసుకురాకూడదు. అంతేకాదు.. చీపురును ఇంట్లో ఏ దిక్కన పడితే ఆ దిక్కులో కూడా పెట్టకూడదు. ఇంట్లో చీపురును ఉంచడానికి ఈశాన్యం, ఆగ్నేయ అసలు మంచిది కాదు.. ఈ దిక్కులో పొరపాటున కూడా పెట్టకూడదు. నైరుతి, వాయువ్యంలో చీపురును పెట్టుకోవచ్చు. కానీ, ఇతరులకు కనిపించకుండా పెట్టుకోవాలని శాస్త్రం చెబుతోంది.
ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే? :
ప్రతి ఇంట్లో ఉండే ముఖ్యమైన వస్తువుల్లో చీపురు ఒకటి. అందరూ ఇల్లంతా చీపురుతో శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ, ఆ చీపురును కూడా శుభ్రం చేయాలన్న విషయం చాలామందికి తెలియదు. అందరూ ఇల్లు శుభ్రంగా చీపురుతో చిమ్మేసి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. అయినా ఆర్థిక ఇబ్బందులు అలానే ఉంటాయి. దానికి కారణం ఏంటంటే.. చీపురుతో ఇల్లును శుభ్రం చేయటం కాదు.. మీరు చిమ్మే చీపురుని కూడా వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని శాస్త్రాల్లో చెప్పారు. అంటే.. నీళ్లతో చీపురును కడుక్కోవాలి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడు నీళ్లతో కడిగి ఆరబెట్టి శుభ్రం చేసుకోవాలనే దానికి ప్రత్యేకంగా ఒక టైం ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్యలో ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఎవరైతే ఈ విధివిధానాలను పాటిస్తారో వాళ్ల ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతం(Permanent)గా స్థిరంగా నివాసం ఉండిపోతుంది.
ఈ రెండు వారాల్లో చీపురు కొనకూడదు :
అలాగే చీపురు మీరు ఎప్పుడు కొన్నా సరే కొన్ని ప్రత్యేకమైన వారాల్లో(Week Days) మాత్రం చీపురు కొనకూడదు. మంగళవారం, శుక్రవారం ఈ రెండు రోజుల్లో మాత్రం చీపురు అసలు కొనకూడదు. మిగతా రోజుల్లో కొనవచ్చు. అలాగే చీపురు పారేసేటప్పుడు కూడా మంగళవారం(Tuesday) లేదా శుక్రవారం(Friday), శనివారం(Saturday) ఇలా మూడు రోజుల్లో బయట పారేయకూడదు. ఈ నియమం అందరూ తప్పనిసరిగా పాటించాలి. అలాగే చీపురుని ఎప్పుడు కొన్నా సరే మీ పుట్టినరోజు కొనకూడదని గుర్తించుకోండి. మీ నక్షత్రాలను బట్టి మీ తిథులను బట్టి పుట్టినరోజు వస్తుంది. అందుకే పుట్టిన రోజు చీపురు కొనకూడదు. అలా కొంటె సమస్యలు వస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆ పక్షంలో కొంటేనే…
కొన్నిసార్లు పాత చీపురు పాడైతే.. కొత్త చీపురును శనివారం రోజున కొని ఇంటికి తేవడం మంచిదని అంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. శుక్లపక్షంలో చీపురును అసలు ఇంటికి తీసుకురాకూడదు. కృష్ణ పక్షంలో మాత్రమే చీపురును కొనాలంట.. శుక్లపక్షంలో చీపురును కొంటే దురదృష్టం కలుగుతుందట.. అనుకోని కష్టాలు వచ్చిపడతాయట.. అందుకే చీపురు వాడకంలో ఈ తప్పులు అసలు చెయ్యకూడదు. లేదంటే కోటిశ్వరుడిని కూడా పేదరికం పట్టిపీడిస్తుందని శాస్త్రం చెబుతోంది.
Published 05 Feb 2024