ప్రధాని మోదీ దుర్గాదేవికి సమర్పించిన బంగారు పూత(Plated With Gold)తో కూడిన వెండి కిరీటం చోరీకి గురైంది. బంగ్లాదేశ్ లోని జెషోరేశ్వరి ఆలయంలో గురువారం మధ్యాహ్నం చోరీకి గురైనట్లు అక్కడి పత్రికల ద్వారా బయటపడింది. ప్రధాని 2021 మార్చిలో ఆ దేశంలో పర్యటించిన సమయంలో జెషోరేశ్వరి టెంపుల్ ను సందర్శించి అమ్మవారికి కిరీటం అందజేశారు.
ఆలయ పూజారి మధ్యాహ్నం 2 గంటలకు బయటకు వెళ్లిపోయారు. తర్వాత క్లీనింగ్ సిబ్బంది వచ్చి చూస్తే అమ్మవారి కిరీటం కనిపించలేదు. పోలీసు కేసు నమోదవడంతోపాటు బంగ్లాలోని భారత హైకమిషన్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. CC TV ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించిన పోలీసులు కిరీటం రికవరీ చేసే పనిలో పడ్డారు. 51 శక్తిపీఠాల్లో ఒకటిగా భావించే జెషోరేశ్వరి టెంపుల్ లో స్వయంగా ప్రధాని సమర్పించిన కిరీటం మాయం కావడం సంచలనానికి కారణమైంది.