జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలపై ఉగ్రవాద(Terrorist) దాడులు(Attacks) కొనసాగుతూనే ఉన్నాయి. దోడా జిల్లా దేశా ఫారెస్టులోని ధారికోట్ ఉరార్బగి ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తుండగా టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(SPG) కార్డన్ సెర్చ్ చేస్తున్న టైంలో దాడికి దిగడంతో నలగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.
ఆదివారం కుప్వారా జిల్లాలో LOC(లైన్ ఆఫ్ కంట్రోల్) వద్ద ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన తర్వాత మరుసటిరోజే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మధ్యకాలంలో కశ్మీర్లో వరుసగా దాడులు జరుగుతున్నాయి. కథువా, దోడా, రియాసి, ఉధంపూర్ జిల్లాల్లోనే ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ఈ ఘటనల్లో 46 మంది ప్రాణాలు కోల్పోతే అందులో సామాన్య పౌరులు 15 మంది, అరుగురు భద్రతా సిబ్బంది ఉన్నారు.