పూర్వ క్రైస్తవులు మతాన్ని విడిచిపెట్టడం వల్లే ఆ సంఖ్య తగ్గిందని తేలింది. జనాభా ద్వారానే ఇస్లాం పెరుగుదల సాధ్యమైంది. ఏ మతాన్ని పాటించని జనాభా పెరిగింది. 23.3%గా ఉన్న వీరు 24.2%కు చేరుకున్నారు. క్రైస్తవంలో సంతానోత్పత్తికి ప్రాధాన్యత ఉన్నా ఆ మతాన్ని అనుసరించనివారు ఎక్కువయ్యారు. హిందువులు 1.2 బిలియన్ల(120 కోట్ల)కు చేరుకుని ప్రపంచ జనాభాలో 14.9% స్థిరమైన వాటాను దక్కించుకున్నారు. తక్కువ సంతానోత్పత్తి వల్ల బౌద్ధులు 34.3 కోట్ల నుంచి 32.4 కోట్లకు తగ్గారు. యూదులు 13.8 మిలియన్ల నుంచి 0.2% పెరుగుదలతో 14.8 మిలియన్లకు చేరుకున్నారు.
రాబోయే కొన్నేళ్లలో ముస్లింలు.. క్రైస్తవ మతానికి దగ్గరగా చేరుకుంటారని నివేదికలు చెబుతున్నాయి. బహాయిలు, జైనులు సైతం స్థిరంగా ఉన్నారు. ఏ మతాన్ని పాటించని వారు అత్యధికంగా చైనాలో, ఆ తర్వాత అమెరికాలో ఉన్నారు. ప్రపంచ క్రైస్తవుల్లో 31% మంది ఆఫ్రికా ఖండం వారే కాగా, యూరప్ వాటా బాగా తగ్గింది. గత కొన్నేళ్లుగా హిందూ మతం నుంచి వలసలు(Migrations) ఆగిపోవడాన్ని నివేదికలు స్పష్టం చేశాయి.
2 thoughts on “పెరిగిన హిందూ జనాభా… ప్రపంచ మతాల లెక్కలివిగో… Hindu Religion”