
కార్తీక శోభతో ఆలయాలు శోభాయమానంగా మారాయి. తెల్లవారుజామునుంచే భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలు జనసంద్రంగా కనిపిస్తున్నాయి. ఆలయాలు, ఇళ్లల్లో దీపాలు వెలిగించి భక్తిప్రపత్తులు చాటుకుంటున్నారు. వేములవాడ, కాళేశ్వర-ముక్తేశ్వర స్వామి, శ్రీశైలం క్షేత్రాల్లో దర్శనాల కోసం పెద్దసంఖ్యలో వేచి ఉన్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు చేస్తున్నారు. వేకువజామునే నదీస్నానం ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీశైలం పాతాళగంగ వద్ద పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.