కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్న మహాకుంభమేళాకు సంబంధించిన అంతరిక్ష చిత్రాల్ని(Images) ఇస్రో విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిలిచింది. 45 రోజుల వ్యవధిలో 40 కోట్ల మంది సందర్శిస్తారనే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఉపగ్రహాల ద్వారా ఇస్రో తీసింది. ఆప్టికల్ ఉపగ్రహాలు.. పగలు, రాత్రి వీక్షించే రాడార్ శాట్ ఆధారంగా ఈ ఫొటోలను హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తీసినట్లు ఇస్రో తెలిపింది. అక్కడి నిర్మాణాలు, రోడ్లు, లేఔట్లు, 2025 కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలన్నింటినీ ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టాయి. మేళాలో విపత్తులు, తొక్కిసలాటలు జరగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం ఇస్రో చిత్రాలను ఉపయోగిస్తోంది.