వినాయక నవరాత్రుల్లో గణపతి(Ganapathi) లడ్డూకు అన్నిచోట్లా డిమాండ్ పెరుగుతోంది. కుల, మత భేదం లేకుండా లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. అలాంటి ఘటనే నిర్మల్(Nirmal)లో కనిపించింది. జిల్లా కేంద్రంలోని ఈద్గాం ఆదర్శనగర్ లో గణపతి లడ్డూ వేలం నిర్వహించారు. హిందూ భక్తుల మాదిరిగానే వేలంలో ముస్లిం మహిళ అమ్రీన్ పాల్గొన్నారు. అందరికన్నా ఎక్కువగా లక్షా 88 వేల 888 రూపాయలకు పాడారు. వినాయకుడి ఎదుటే ఆమెకు ఘనంగా సన్మానం చేసి లడ్డూ గంపను తలపై పెట్టి అందజేశారు. ఇలా మత సామరస్యం వెల్లివిరియడం అందర్నీ ఆకట్టుకుంది.