46 సంవత్సరాల తర్వాత పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం(Treasure Trove) తెరచుకుంది. ఒడిశా సర్కారు ఆదేశాలతో ఈ మధ్యాహ్నం గదిని అధికారులు తెరిచారు. 1978లో ఈ భాండాగారాన్ని మూసివేయగా.. తాజాగా బిశ్వనాథ్ రథ్ ఛైర్మన్ గా నియమించిన కమిటీ ఆధ్వర్యంలో గది తాళాల్ని తీశారు.
మూడు దశలివే…
మొత్తం మూడు దశల్లో కార్యక్రమాలు పూర్తి చేశాక లెక్కింపు మొదలుపెడతారు. తొలుత బయట గదిని తెరవడం, రెండో దశలో లోపలి(Inner) భాండాగారాన్ని తెరిచాక ఆ సంపదను తరలించే ప్రక్రియను మూడోదశగా పరిగణిస్తారు.
కమిటీలతో…
ప్రభుత్వ కమిటీతోపాటు శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్(SJTA) ఛైర్మన్ అరబింద పఢీ సైతం అక్కడే ఉన్నారు. ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన పఢీ.. నగల్ని(Valuables) గుర్తించేందుకు ప్రత్యేకంగా వాటిని భద్రపరచాలని కోరారు. ASI(ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా)తోపాటు సేవా సంఘాలు, శ్రీగణపతి మహరాజ్ వంటి స్వాములు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు.