
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్రమ దందాకు అడ్డులేకుండా పోయింది. దాతలు, వీఐపీ బ్రేక్ దర్శనాల్లో అందించే శాలువాల్లోనూ మోసంతో కోట్లు సంపాదించారు. స్వచ్ఛమైన మల్బరీ పట్టు, తెలుగు,
సంస్కృతంలో ఓం నమో వేంకటేశాయ, పట్టు హోలోగ్రామ్ ఉండాల్సిన శాలువాల్ని సరఫరా చేయాలి. కానీ AP నగరికి చెందిన VRS ఎక్స్ పోర్ట్ కంపెనీ పట్టుకు బదులు పాలిస్టర్ దుపట్టాలు ఇచ్చింది.
రూ.54.95 కోట్ల విలువైన సామగ్రిని 2015-2025 సరఫరా చేస్తోంది. ఇప్పటికే లడ్డూల్లో కల్తీ నెయ్యిపై విచారణ జరగ్గా, ఇప్పుడీ శాలువాలపైనా దర్యాప్తు సాగనుంది. జరిగిన ఘటనపై TTD బోర్డు విజిలెన్స్ విచారణకు
ఆదేశించింది.