దశాబ్ద కాలం(Decade) తర్వాత పూర్తిస్థాయిలో ‘చంద్రగ్రహణం’ ఏర్పడుతోంది. సెప్టెంబరు 7న రాత్రి మొదలై 8న పూర్తవుతుంది. ఎరుపు, నారింజ రంగుతో ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, న్యూజిలాండ్ లో పూర్తిగా దర్శనమిస్తుంది. ఉత్తర, దక్షిణ అమెరికాల్లో కనపడకున్నా ప్రపంచ జనాభాలో 85% మంది వీక్షించొచ్చు. గ్రహణ సంపూర్ణ దశ 82 నిమిషాలుంటుంది. సూర్యగ్రహణాల్లా కాకుండా ఎలాంటి పరికరాల్లేకుండా చూడొచ్చు.
ఎప్పుడెలా అంటే…
గ్రహణం ప్రారంభం..: రాత్రి 8:58 గంటలకు(సెప్టెంబరు 7)
బ్లడ్ మూన్ దశ..: 11:00 నుంచి 12:22 గంటల వరకు
గ్రహణం పూర్తి..: అర్థరాత్రి 2:25 గంటలకు(సెప్టెంబరు 8)