మహాకుంభమేళా పుణ్యస్నానాల కోసం ఒక్కరోజే కోట్లాది మంది రావడంతో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో విషాదం చోటుచేసుకుంది. భారీ తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోగా, పెద్దసంఖ్యలో భక్తులు గాయాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట ఏర్పడింది. మౌని అమావాస్య(Mouni Amavasya) సందర్భంగా అమృత స్నానాల కోసం ఈరోజు 10 నుంచి 15 మంది కోట్ల దాకా ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నట్లు అంచనా వేశారు. సెక్టార్-2 ప్రాంతంలో తొక్కిసలాట జరగ్గా పెద్దయెత్తున సహాయక చర్యలు చేపడతున్నారు. UP CM యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా, ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. రాష్ట్ర, కేంద్ర బలగాలు, సహాయ బృందాలు ప్రయాగ్ రాజ్ లో చిక్కుకున్న వారిని బయటకు తెస్తున్నారు.