శ్రీవారు కొలువైన తిరుమల(Tirumala)లో పవిత్రత, ఆధ్యాతికతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చర్యలు మొదలుపెట్టింది. కొండపై రాజకీయ, విద్వేషపూరిత ప్రసంగాల(Speeches)ను నిషేధించింది. నిత్యం గోవిందనామాలతో మార్మోగే తిరుగిరుల్లో రాజకీయ నాయకుల సందడి ఎక్కువైంది. శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడల్లా దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడటం, ఎదుటివారిపై తీవ్రంగా విమర్శలు చేయడం అలవాటుగా మారింది. దీనివల్ల ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతున్నదని భావించిన TTD బోర్డు.. వీటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బోర్డు హెచ్చరించింది.