మహాకుంభమేళాలో భాగంగా ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వద్ద జరిగిన తొక్కిసలాట(Stampede) దురదృష్టకరమన్న సుప్రీంకోర్టు.. చర్యలకు ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ అధికారులపై చర్యలకు ఆదేశించలేమంటూనే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(PIL)ను కొట్టేసింది. ఈ ఘటనపై న్యాయ విచారణ(Judicial Enquiry) కమిటీ ఏర్పాటైంది కాబట్టి అలహాబాద్ హైకోర్టునే సంప్రదించాలని పిటిషనర్ కు సూచించింది. తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అడ్వకేట్ విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించేలా UP సర్కారును ఆదేశించాలని, నిర్లక్ష్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని కోరారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా రాష్ట్రాలకు స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేయాలని కోరగా, CJI సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది.