మేష రాశి
ఈ రోజు ఈ రాశి స్త్రీ, పురుషులకు అనుకూలంగా లేకపోవటం వలన మాటల్లో సంయమనం పాటించండి. కుటుంబ సంబంధాల్లో కొన్ని చికాకులు ఏర్పడవచ్చు. ఇది ఆఫీస్ వ్యవహారాలపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రేమికుల జీవితాల్లో ఈ రోజు ఏదో ఒక ప్రత్యేకత ఉండబోతోంది. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఈ రోజు మీ ఇంటికి సంబంధించి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరు చేసిన సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగం చేసేవారికి అధికార పక్షం నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజు ప్రయాణాల్లో పరిస్థితులు అనుకూలంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రేమికుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. మాటల్లో సంయమనం పాటించండి. లేదంటే కుటుంబ సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. మీ ప్రియమైన వారి ఆరోగ్యం క్షీణిస్తుంది.
మిథున
ఈ రాశి వారికి ఈ రోజు జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. సామాజిక సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామితో వివాదం ఏర్పడుతుంది. సంయమనంతో వాటిని చక్క దిద్దండి లేదంటే దూరం పెరిగే అవకాశం ఉంది. పాత ప్రేమికులు ఈ రోజు కలుసుకుంటారు.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ప్రయాణాల్లో పరిస్థితులు ప్రయోజనంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీ, పురుషులు ప్రియమైన వారి వలన వేదన అనుభవిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రేమికులు ఒకరిని ఒకరు సంతోషపెట్టడానికి అధిక ఖర్చు చేయవలసి ఉంటుంది. మానసికంగా స్థిమితంగా ఉండలేరు. పరధ్యానంలో గడుపుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో కూడా ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి.
సింహ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవనోపాధి రంగంలో పురోగతి సాధిస్తారు.కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి.
కన్యా రాశి
ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టండి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హంగూ ఆర్భాటాలకు తావీయకుండా ఖర్చులను నియంత్రించండి. ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకండి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కొన్ని చిక్కులు, సమస్యలు తప్పవు. ఇరువురి బంధంలో స్థిరత్వం లోపిస్తుంది. పిల్లల చదువుపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
తులా రాశి ఫలాలు
ఈ రోజు జీవనోపాధి రంగంలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికార పక్షం నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. సృజనాత్మక పనిలో విజయం సాధిస్తారు. ప్రియమైన వారి నుంచి స్పెషల్ గిఫ్ట్ పొందుతారు. సంబంధ బాంధవ్యాల్లో ఒత్తిడి తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమికులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
వృశ్చిక రాశి
ఉద్యోగస్తులకు కార్యాలయంలో అధికార పక్షం నుంచి మద్దతు లభిస్తుంది. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది, వివాహిత స్త్రీలు ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. వివాహం అయినవారు జీవిత భాగస్వామితో బయటికి వెళ్లే అవకాశముంది.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఈరోజు మీ చుట్టూ ఉన్నవారి మద్దతు లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వీటి వల్ల మనసు కలత చెందుతుంది. సృజనాత్మక పనుల్లో అప్రమత్తంగా ఉండండి. స్నేహితులతో, సన్నిహితులతో మీకున్న అనుబంధం క్షీణించవచ్చు.
మకర రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు సంతానం గురించి ఆందోళన చెందుతారు. పరిస్థితుల కారణంగా మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన బాధ పడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
కుంభ రాశి
ఈ రోజు మీ కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి వృద్ధి చెంది పరిస్థితులు మెరుగుపడతాయి. నూతన గృహోపకరణాలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి మద్దతు, సాంగత్యం లభిస్తుంది. భార్యా భర్తలు ఈ రోజు అన్యోన్యంగా నడుచుకుంటారు. ఈ రోజు మీరు మీ భాగస్వామితో ఏకాంత సమయం గడుపుతారు.
మీన రాశి
వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. నూతన ప్రణాళికలు విజయవంతమవుతాయి. బహుమతులు, సన్మానాలు పెరుగుతాయి. ఈ రోజు మీరు కోరుకున్న పనులు పూర్తికావడంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు ఈ రాశి స్త్రీలను ప్రేమికుడు ఆశ్చర్యపరుస్తాడు. ఈ రోజు మీకు కలర్ ఫుల్ గా గడిచిపోతుంది.
************************
రాళ్లపల్లి సరస్వతీదేవి