
శ్రీవారి దర్శన, ఆర్జిత సేవా(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన) టికెట్లు నేడు విడుదలవుతాయి. 2026 ఫిబ్రవరి ఆన్ లైన్ కోటాలో ఉదయం 10కి TTD విడుదల చేస్తుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ అందుబాటులో ఉంటుంది. 20న ఉదయం 10 వరకు ఆర్జిత సేవ డిప్, 21న ఉదయం 10కి మరిన్ని ఆర్జిత, మధ్యాహ్నం 3కు వర్చువల్ సేవా టికెట్లుంటాయి. 24న 10కి అంగప్రదక్షిణం, 11కు శ్రీవాణి ట్రస్ట్ దర్శన, మధ్యాహ్నం 3కు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లుంటాయి. 25న 10కి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా, మధ్యాహ్నం 3కి వసతిగదుల కోటా టికెట్లు విడుదలవుతాయి.