వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోటా ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పూర్తి చేసింది. రూ.300 టికెట్లకు ఆన్ లైన్లో నిర్వహించిన కోటాకు లక్షలాదిగా భక్తులు పోటీ పడ్డారు. కేవలం 20 నిమిషాల్లోనే 1.40 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు TTD వర్గాలు తెలిపాయి. వైకుంఠ ద్వార దర్శనాలు(SED) టికెట్లను ముందుగా ప్రకటించిన మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. మార్చి నెల శ్రీవాణి కోటా టికెట్లను రేపు ఉదయం 11 గంటలకు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఈ నెల 26న పొద్దున 11 గంటలకు TTD విడుదల చేయనుంది.