
తిరుమలలో ఆదివారం నాడు పెద్దసంఖ్యలో దర్శనాలయ్యాయి. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టింది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 78,217 మంది స్వామి వారిని దర్శించుకోగా, 25 వేల మంది తలనీలాలు సమర్పించారు. రూ.4.75 కోట్ల హుండీ ఆదాయం లభించింది. కార్తీక మాసం సందర్భంగా వారాంతాలతోపాటు సాధారణ రోజుల్లోనూ శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాలకు భారీ సంఖ్యలో భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు. దీంతో అలిపిరి వద్ద రద్దీ ఏర్పడుతోంది. కార్తీక దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.