
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఎక్కువైంది. కంపార్టుమెంట్లన్నీ నిండి కృష్ణ తేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 80,113 మంది దర్శించుకోగా, 31,683 మంది తలనీలాలు సమర్పించారు. రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. శనివారం నాడు భారీ సంఖ్యలో కొండపైకి రాగా, ఆదివారం అది మరింత పెరుగుతుంటుంది.