అశేష భక్తజన(Pilgrims) మహిమాన్విత క్షేత్రం తిరుమల(Tirumala).. సాలకట్ల బ్రహ్మోత్సవాలతో జనసంద్రంగా మారింది. మూడో రోజు స్వామి వారు ఆదివారం ఉదయం సింహవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సింహవాహనంపై మలయప్పస్వామి మాడవీధుల్లో దర్శనమిస్తూ కనువిందు చేశారు. గోవింద నామస్మరణతో తిరుగిరులు పులకించిపోయాయి.
ఈ రోజు రాత్రి స్వామి వారు సర్వభూపాల వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కాగా.. నిత్యం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు.