
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని వారి దర్శనానికి 18 గంటలు పడుతోంది. వారాంతపు రోజుల్లో
ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేశారు. నిన్న స్వామి వారిని 60,896 మంది దర్శించుకున్నారు. 23,077 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం నాడు స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లుగా ఉంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవలకు భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు.