మేష రాశి
ఈ రాశికి చెందిన మహిళా అధికారులకు మీ తోటి సహోద్యుగుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం ఆనంద దాయకంగా ఉంటుంది. వ్యాపార ప్రణాళికలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో గడిపిన పాత క్షణాలు గుర్తు తెచ్చుకుని మంచి అనుభూతికి లోనవుతారు.
వృషభ రాశి
ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. తండ్రి లేదా మత గురువు మద్దతు పొందుతారు. సృజనాత్మక పనుల్లో పురోగతి సాధిస్తారు. బహుమతులు, సన్మానాలు పొందుతారు. కొంత అసౌకర్యానికి లోనవుతారు. విద్య, వ్యాపారం, ఉద్యోగం విషయాలకు సంబంధించిన ప్రయాణాలు ఉండవచ్చు.
మిథున రాశి
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. అకారణ గందరగోళం ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకండి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి.మీరు ప్రేమించిన వ్యక్తులనుంచి ఎక్కువగా ఆశించి బాధపడకండి.
కర్కాటక రాశి
మీకు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో ఖ్యాతి పెరిగి వృద్ధిలోకి వస్తారు. సంపద, గౌరవం, కీర్తి, పెరుగుతాయి. సంబంధ భాందవ్యాలు బలపడతాయి. పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఉద్యోగస్తులకు బదిలీ ఉండవచ్చు. ప్రేమికులు ఈ రోజు సమస్యల్లో చిక్కుకుంటారు. అవివాహితులకు వివాహానికి అనుకూలమైన సమయం. విదేశీ సంబంధాలు వచ్చే అవకాశముంది.
సింహ రాశి
ఈ రాశివారు ఆరోగ్యం పై శ్రద్ద పెట్టండి. శారీరక వ్యాధుల వలన ఒత్తిడికి గురవుతారు. తలపెట్టిన పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఈ రోజు ఈ రాశి ప్రేమికులు చిరకాల కోరికను బహిర్గతం చేస్తారు. ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌర వించుకుంటారు.
కన్యా రాశి
సంతానం వలన కొందరు, చదువు కారణంగా కొందరు ఆందోళన చెందుతారు. అనవసర హడావిడి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకండి. జీవిత భాగస్వామితో వాదనని పెంచవద్దు. అపార్థాలకు, గొడవలకు తావిచ్చినట్టు అవుతుంది. ప్రేమికులు ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటారు ఫలితంగా ఈ రోజు రొమాంటిక్ గా కలర్ ఫుల్ గా ముగుస్తుంది.
తులా రాశి
ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. కుటుంబ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఈ రోజు వ్యాపార భాగస్వామి ప్రవర్తన వింతగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆస్తి వలన ప్రయోజనాన్ని పొందుతారు.
వృశ్చిక రాశి
బహుమతులు, సన్మానాలు పెరుగుతాయి. ఇతరుల నుంచి సహాయం పొంది అనూహ్య విజయం సాధిస్తారు. జీవనోపాధికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ప్రేమికులకు శుభ దినం. వివాహ ప్రతి పాదనలకు, చర్చలకు అనుకూలమైన రోజు.
ధనుస్సు రాశి
ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సృజనాత్మక రంగంలో ఉన్నవారు విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి మద్దతు, సాంగత్యం లభిస్తుంది. ప్రేమికుల ఆశలు ఈ రోజు నెరవేరుతాయి. వివాహితులు, ప్రేమికులు కూడా ఏకాంతం లో గడుపుతారు. అనేక అనుభూతులను పొందుతారు.
మకర రాశి
జీవనోపాధి కోసం చేసే కృషి ఫలించి మంచి రంగం లో సెటిల్ అవుతారు. బహుమతులు, సన్మానాలు పెరుగుతాయి. అధికార పక్షం నుంచి మద్దతు లభిస్తుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించండి. ఇంటి బాధ్యతల కోసం సమయం కేటాయించండి. ప్రయాణాల్లో లాభదాయకంగా ఉంటుంది.
కుంభ రాశి
అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి. మనసు కుంగుబాటుకు లోను కావొచ్చు కానీ తెలివితేటలతో దాన్ని అధిగమిస్తారు. బహుమతులు, సన్మానాలు పెరుగుతాయి. నూతన జీవిత భాగస్వామితో సాయంత్రం ఆహ్లాదంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో అపార్థాలు సమసిపోతాయి. ఈ రోజు మీ భాగస్వామి మీ పై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు.
మీన రాశి
కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. గృహోపకరణాలు పెరుగుతాయి. సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు మీ ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు. ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. మీకు ఇష్టమైన కొన్ని కోరికలు నెరవేరుతాయి. నూతన కొనుగోళ్లు ఉండవచ్చు.
రాళ్లపల్లి సరస్వతీదేవి