మేష రాశి (Aries)
ఈ రోజు మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం వింటారు. పిల్లలను సరైన మార్గంలో మీరు పెడితే వాళ్లు వాటికి అనుగుణంగా జీవిస్తారు. ఉద్యోగస్తులు ఆఫీస్ లో ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకండి. వాటి వలన మీ పని ముందుకు సాగదు. మీ చుట్టుపక్కల వారితో వాదనలకు దిగితే తరువాత మీకు సమస్యలు వస్తాయి. మీరు ఏదైనా చట్టపరమైన సమస్యల్లో లేదా వ్యవహారంలో ఉంటే విజయం సాధిస్తారు.
వృషభ రాశి ( Taurus)
ఈ రోజు మీకు ఆందోళన కలిగించే రోజు. సంతానం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. మీరు ఏదైనా ఒక విషయంలో ఆందోళన చెందుతుంటే, అది ఈ రోజుతో సమసిపోతుంది. ఈరోజు స్నేహితులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. కొన్ని కొత్త ఒప్పందాల వలన ప్రయోజనం పొందుతారు. రాజకీయ రంగంతో సంబంధం ఉన్నవారు కీలక నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఏదైనా ప్రభుత్వ పథకంలో డబ్బు పెట్టుబడి పెడితే, మీరు దాని నుంచి ప్రయోజనాలను పొందుతారు.
మిథున రాశి (Gemini)
ఈ రోజు మీకు మిశ్రమ రోజు కాబోతోంది. విద్యార్థులు మీ చదువుపై దృష్టి పెట్టాలి. మీరు ఈ రోజు మీ పనికి సంబంధించిన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది . ఈ రోజు మీరు మీ విలువైన వస్తువులను కాపాడుకోవాలి. మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం కేటాయించి ఆనందంగా గడపండి. ఈ రోజు ఎవరికీ అనవసర సలహాలు ఇవ్వకండి, సమస్యలను తెచ్చిపెడతాయి. విద్యార్థులు ఈ రోజు పోటీలలో పాల్గొంటారు. కష్టపడితే విజయం దక్కుతుంది.
కర్కాటక రాశి (Cancer)
ఈరోజు మీరు కొత్త ఆస్తిని పొందుతారు. జీవనోపాధి రంగంలో కొత్తవారితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. మీరు కొత్తగా ప్రాపర్టీ కొనాలనుకుంటే, దాని కోసం ఒక ప్రణాళికను రూపొందించుకోవచ్చు. మీరు వ్యాపారంలో కొన్ని కొత్త పద్ధతులను అవలంబిస్తారు. ఈ రోజు మీ ఇంటికి స్నేహితులు వచ్చే అవకాశముంది. ఉద్యోగస్తులు మీ బాస్ తో ఏ విషయంలోనూ వాగ్వాదం పెట్టుకోకండి. మీ ప్రమోషన్ కు అంతరాయం కలిగే ఛాన్స్ ఉంది.
సింహ రాశి (Leo)
ఈ రోజు మీకు ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు ఏర్పడుతాయి. మీరు మీ ఆదాయం, ఖర్చుల కోసం నూతన ప్రణాళికలు వేస్తారు. మీరు వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్య మార్గం సుగమం అవుతుంది. తోబుట్టువుల సలహాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆశీస్సులతో మీరు ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు.
కన్యా రాశి (Virgo)
ఈ రోజు మీకు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సంతానం వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంతో పాటు పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకునే వారి కోరిక కూడా ఈ రోజు నెరవేరుతుంది. మీరు చట్టపరమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు. మీరు దాతృత్వ కార్యక్రమాలలో కొంత డబ్బును పెట్టుబడి పెడతారు. మీరు పిల్లలతో సరదాగా గడుపుతారు.
తులా రాశి (Libra)
ఈ రోజు ఆహ్లాదకర మైన వాతావరణం మీ చుట్టూ ఉంటుంది. మీరు ఇది వరకు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో చాలావరకు విజయం సాధిస్తారు. మీరు మీ చుట్టుపక్కల నివసించే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి, మీ శత్రువులు కొందరు మిత్రులుగా ఉండవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు ఈరోజు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ మాటలపై నియంత్రణ ఉంచుకోండి, లేకపోతే మీకు తరువాత సమస్యలు వస్తాయి. అవివాహితులు వివాహానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు మీకు ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తే అవకాశముంది. ఏ చిన్న సమస్య వచ్చిన అశ్రద్ధ చేయకుండా మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. మీరు ఈ రోజు నూతన కార్యక్రమాలు మొదలు పెట్టినట్లయితే అప్రమత్తంగా ఉండాలి. పొరపాట్లు జరిగే అవకాశముంది. ప్రేమికులు ఔటింగ్ కి వెళ్తారు. ఏకాంతంలో గడుపుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఆచితూచి వ్యవహరించండి. తప్పుడు నిర్ణయం తీసుకుంటే, అది తరువాత మీకు సమస్యలును తెస్తుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆగిపోయిన ఏ పనినైనా తల్లిదండ్రుల ఆశీస్సులతో పూర్తి చేస్తారు.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రోజు ఆర్ధిక విషయాలకు సంబంధించి మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఇంతకు ముందు ఇచ్చిన రుణాలు ఈ రోజు తిరిగి పొందవచ్చు. ఆఫీస్ లో ఏదైనా సమస్య ఉంటే, అది కూడా ఈ రోజు సమసిపోతుంది. మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచనలున్నాయి.
మకర రాశి (Capricorn)
ఆర్థిక పరంగా ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఉపాధి కోసం చూస్తున్న వారికి ఈ రోజు మంచి అవకాశం లభిస్తుంది. ఈరోజు మీరు కుటుంబ, ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. మీకు ఇష్టం లేని వ్యక్తులు మీకు తారసపడే అవకాశముంది. ఈరోజు మీరు తల్లిదండ్రుల సేవలో ఎక్కువ సమయం గడుపుతారు. మీరు ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉంటే మంచిది. లేకపోతే తరువాత పశ్చాత్తాపపడతారు. ఉద్యోగంలో ఉన్నవారు అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (Aquarius)
మిగిలిన రోజులతో పోలిస్తే ఈ రోజు మీకు అత్యంత శుభదినం. వ్యాపారంలో, మీరు భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభిస్తే, అది మీకు మంచి లాభాలు చేకూరుస్తుంది. మీరు వ్యాపారంలో ఉన్నతస్థాయికి వెళ్తారు. మీకు కొత్తగా శత్రువులు ఏర్పడే అవకాశముంది. మీ వ్యాపారం, స్నేహితుడి సలహాతో అభివృద్ధి చెందుతుంది. మీకు అదృష్టం అన్నిటా కలిసి వస్తుంది. మీరు పాత పెట్టుబడుల కారణంగా మంచి లాభాన్నిపొందుతారు. పిల్లల చదువుకు సంబంధించి ఎదురైన సమస్యలు ఈ రోజుతో సమసిపోతాయి.
మీన రాశి ( Pisces)
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు మీ విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సలహా మీకు వ్యాపారం లో మేలు చేస్తుంది కాబట్టి మీరు వారిని సంప్రదించి ముందుకు సాగితే మీకే మంచిది. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి నూతన ప్రణాళికలు చేయటానికి ఈ రోజు మంచి రోజు. ఈ రాశి స్త్రీ, పురుషులు వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యలను ఈ రోజుతో అధిగమిస్తారు. మీరు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఖర్చుల విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చులు చేయకండి.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది.. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.