మేష రాశి (Aries)
ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సమస్యలతో బాధపడతారు. తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జీవనోపాధి రంగంలో కొనసాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికుల మధ్య ఏర్పడిన అపార్థాలు, విభేదాలు, ఈ రోజు తొలగి మీ బంధం బలపడుతుంది.
వృషభ రాశి ( Taurus)
ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మిగతా విషయాల్లో స్నేహితుడు లేదా సోదరుల సహకారంతో విజయం సాధిస్తారు. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. ఈ రోజు మీ సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన సమయం. పరీక్షలు లేదా పోటీలో పాల్గొనే విద్యార్థులు విజయం సాధిస్తారు.
మిథున రాశి (Gemini)
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. స్నేహ సంబంధాలు మరింత బలపడతాయి. ఈ రోజు ఇతరుల సహకారం పొంది పనుల్లో విజయం సాధిస్తారు. ధార్మిక, సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ రోజు, మీకు మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. సామాజిక రంగంలో మీ చురుకుదనం పెరుగుతుంది.
కర్కాటక రాశి (Cancer)
ఈ రోజు ఈ రాశి వారికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తికావడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఈ రోజు కుటుంబం కోసం కొంత సమయాన్ని వెచ్చించండి. మీ కుటుంబంతో కలిసి ఓ శుభ కార్యక్రమంలో పాల్గొంటారు.
సింహ రాశి (Leo)
ఈ రోజు ఈ రాశి వారు సృజనాత్మక పనిలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సమస్య రాగానే వైద్యుల్ని సంప్రదించండి. మానసికంగా బలహీనంగా, విచారంగా ఉంటారు. ఈ రోజు మీకు వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. మీరు ఆఫీస్ పనుల్లో నిబంధనలు అనుసరించి పని చేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రాజెక్టులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆందోళన చెందకండి.
కన్యా రాశి (Virgo)
ఈ రోజు మీకు అత్యంత శుభదినం. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. విద్యారంగంలో, పోటీలలో ముందుకు దూసుకుపోతారు. వ్యాపారస్తులకు నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు మీ ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
తులా రాశి (Libra)
ఈ రోజు మీకు అత్యంత శుభ దినం. ఈ రాశి వారికి ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నత మహిళా అధికారి నుంచి మద్దతు లభిస్తుంది. తెలివితేటలతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ సానుకూల దృక్పథం కారణంగా, మీరు ఈ రోజు మీ శత్రువులపై ఆధిపత్యం సాధిస్తారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు ఈ రాశి వారు సృజనాత్మక పనిలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రాశి స్త్రీ, పురుషులు ఈ రోజు శుభవార్త వినే అవకాశం ఉంది . మీకు ఉన్న రహస్య శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అప్రమత్తంగా ఉండండి.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేనందువల్ల మాటల్లో సంయమనం పాటించండి. ఈ రోజు మీ మనసును కలచివేసే సంఘటన ఎదురవుతుంది. జీవనోపాధి రంగంలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఈ రోజు మీకు సంతోషంతో నిండి ఉంటుంది. ఆఫీసులో తోటి సహోద్యోగులతో మంచి సమన్వయం ఉంటుంది.
మకర రాశి (Capricorn)
ఈ రోజు మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ కారణంగా కుటుంబ ప్రతిష్ఠ పెరుగుతుంది. సంపద, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఈ రోజు మీరు శారీరక, మానసిక సమస్యలని ఎదుర్కొంటారు. కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తారు. రాజకీయ నాయకులకు ప్రజాజీవితంలో గౌరవం లభిస్తుంది.
కుంభ రాశి (Aquarius)
ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. శారీరక మానసిక సమస్యల్ని ఎదుర్కొని ఒత్తిడికి గురి అవుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది . సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతులు పొందుతారు.
మీన రాశి ( Pisces)
ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ రోజు సంతానం బాధ్యతలు నెరవేరుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. విద్య సంబంధిత పోటీల్లో కొనసాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు నూతన వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీరు ఏ కార్యం మొదలు పెట్టినా తప్పకుండ విజయం సాధిస్తారు. ప్రయోజనం కూడా పొందుతారు.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.