అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్లే వారికి పరిస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇతరుల సహకారం తీసుకోవడంలో విజయం సాధిస్తారు.
మేష రాశి (Aries)
ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. విద్యార్థులకి అనుకూలమైన రోజు. పోటీలలో, పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు నూతన వ్యాపార ప్రణాళికలు ఫలవంతంగా సాగుతాయి. దూరపు బంధువు నుంచి వచ్చిన ఆకస్మిక సమాచారం కుటుంబం మొత్తాన్ని సంతోషంలో నింపుతుంది. నూతన ఉత్తేజాన్నిస్తుంది.
వృషభ రాశి ( Taurus)
ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబ సంబంధాలలో మరింత అన్యోన్యత పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో ఏకాంతంలో గడుపుతారు. కొందరికి బహుమతులు లభిస్తాయి, మరికొందరికి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత అధికారుల ప్రశంసలు పొందుతారు, ఈ రోజు మీకు మత గురువు మద్దతు దొరుకుతుంది. ప్రేమికులకు అనుకూలమైన రోజు. మీరిద్దరూ నిబద్ధతతో కట్టుబడి ఉంటారు కాబట్టి ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది.
మిథున రాశి (Gemini)
ఈ రాశి వారు ఈరోజు చేసే వృత్తిపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. సృజనాత్మక పనులలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల సహకారం ఉంటుంది. జీవనోపాధి విషయంలో మెరుగ్గా ముందుకు సాగుతారు. రోజువారీ పనులు సులభంగా పూర్తవుతాయి. వృత్తి పరంగా ఇది అద్భుతమైన సమయం.
కర్కాటక రాశి (Cancer)
ఈరాశి వారికి ఈ రోజు వృత్తిపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్లేవారికి ఈ రోజు అనుకూలమైన సమయం. ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఇతరుల సహకారం తీసుకోవడంలో విజయం సాధిస్తారు. పనులు కూడా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఈ రోజు మీరు అనవసర ఖర్చులు నియంత్రించండి. షాపింగ్ ఆఫర్, లాటరీ కొనుగోళ్లు లాంటి వాటికి డబ్బు వృథా చేయకండి.
సింహ రాశి (Leo)
ఈ రోజుఈ రాశి స్త్రీ, పురుషులుకు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అవగాహనతో శ్రద్ధగా మెలగండి. నిర్లక్ష్యం పనికిరాదు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు ఈ రోజు వృత్తి పరంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు నూతన ప్రాజెక్ట్ పొందవచ్చు. వ్యాపారస్తులకు పెట్టుబడులకు అనుకూలమైన రోజు.
కన్యారాశి (Virgo)
ఈ రోజు ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేనందువలన మాటల్లో, చేతల్లో సంయమనం పాటించండి. ఈ రోజు మీరు అనవసర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆందోళన చెందకండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ తెలివి తేటలతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సృజనాత్మక పనులలో పురోగతి సాధిస్తారు.
తులా రాశి (Libra)
ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారు. ఇతరుల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి అనువైన రోజు. అన్నిటా విజయం సాధిస్తారు. మీ కృషి ఫలించి మంచి ఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశి (Scorpio)
మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. సంపద, కీర్తి, వృద్ధిలోకి వస్తాయి. బహుమతులు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ప్రయాణానికి అనుకూలమైన రోజు. ఆహ్లాదంగా సాగుతుంది మీ ప్రయాణం. ఈ రోజు మీకు మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులు కొంచెం కష్టపడితే భారీ లాభాలు పొందవచ్చు.
ధనుస్సు రాశి (Sagittarius)
మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లలు చదువుల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. స్థాన మార్పులకు అవకాశమున్నా అనుకూల సమయం కానందున నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఉన్న చోటనే కొనసాగండి.
మకర రాశి (Capricorn)
ఈ రాశి, స్త్రీ పురుషులకు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ సహచరి సాంగత్యాన్ని పొందుతారు. కుటుంబ, ఆర్ధిక, సామాజిక సంబంధాలు దృఢంగా ఏర్పడతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నత అధికారుల నుంచి పూర్తి సహకారం పొందుతారు. మీరు మీ నైతికత, నిజాయతీని కాపాడుకుంటారు.
కుంభ రాశి (Aquarius)
ఈ రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేనందున అప్రమత్తంగా ఉండండి. ప్రత్యర్థుల వలన ప్రమాదం పొంచి ఉంది. ఏదో తెలియని భయం మనస్సును చంచలంగా మారుస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. స్నేహితులు వలన కూడా ఆందోళన చెందుతారు. మిమ్మల్ని మీరు శక్తి వంతంగా మార్చుకోండి. మీ కుటుంబంలో శాంతి , ఆనందం వెల్లి విరుస్తుంది.
మీన రాశి ( Pisces)
ఈ రోజు మీ నమ్మకంతో, ధైర్యంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. మీ కారణంగా ఈ రోజు మీ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవనోపాధి రంగంలో పురోగతి సాధిస్తారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు కలిసివస్తాయి.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది, దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.