మేష రాశి (Aries)
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. మీ ఆత్మీయులు మీ ఇంటికి వచ్చే అవకాశముంది. మాటల్లో సంయమనం పాటించండి. ఈ రోజు మీరు సంతానం నుంచి శుభవార్తలు వింటారు. మీ తల్లికి అనారోగ్య సూచన, అప్రమత్తంగా ఉండండి. అనవసర చర్చలకి దూరంగా ఉండండి. సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
వృషభ రాశి ( Taurus)
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభ దినం. ఆర్ధిక విషయాలలో మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ ఈ రోజు పూర్తవుతాయి, ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు చేసిన పాత తప్పు నుంచి ఈ రోజు బయటపడే అవకాశముంది. మీ మనస్సు ఆధ్యాత్మిక కార్య క్రమాల్లో నిమగ్నమవుతుంది. ఉద్యోగస్తులు కొత్త ఒప్పందాలు, ప్రణాళికలు చేయకండి. సమస్యలు తలెత్తే అవకాశముంది. మీరు పాత స్నేహితుడిని కలుస్తారు. విద్యార్థుల ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది.
మిథున రాశి (Gemini)
ఈ రోజు మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. మీరు ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు పొందుతారు. మీ జీవన పురోగతికి అడ్డంకులుగా ఉన్న వాటిని ఈ రోజు అధిగమించవచ్చు. ఆగిపోయిన మీ పనులు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో తిరిగి ప్రాంభమవుతాయి. మీకు సంబంధించిన విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మీరు మీ స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి (Cancer)
ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. స్థిర, చరాస్తులు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు ఈ రోజు పరిష్కారమవుతాయి. మీ పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలకు అనువైన సమయం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదం జరిగే అవకాశముంది. భాగస్వామ్య వ్యాపారంలో అప్రమత్తంగా ఉండండి. మోసపోయే అవకాశముంది.
సింహ రాశి (Leo)
ఈ రాశి స్త్రీ, పురుషులు ఈ రోజు గందరగోళం ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు అనవసరమైన ఒత్తిళ్లు ఉంటాయి. ఇతరుల పనిపై ఎక్కువగా దృష్టి పెట్టి ఇబ్బందులు తెచ్చుకోకండి. మీరు ఈ రోజు అనవసర చర్చలకు దూరంగా ఉంటే మీకే మంచిది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు ప్రత్యర్థుల నుంచి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. శత్రువులు మీ పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు, దీనిని మీరు నివారించటానికి ప్రయత్నించండి.
కన్యారాశి (Virgo)
ఈ రోజు మీకు అనుకూలంగా లేనందువలన అప్రమత్తంగా ఉండండి. వ్యాపారస్తులు ఇదివరకు ఆగిపోయిన పనులు వేరే వాళ్ల సహాయంతో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులుకు ఈ రోజు బాగానే ఉంటుంది. అధికారులతో మీ సంబంధం బలపడుతుంది. మీరు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరచి అధికారులను ఆశ్చర్యపరుస్తారు. మీరు పోటీ రంగంలో ముందుకు సాగుతారు. దూరపు బంధువుల నుంచి నిరాశపరిచే సమాచారం వింటారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాల్లో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
తులా రాశి (Libra)
ఈ రోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అశ్రద్ధ వహించకుండా అప్రమత్తంగా ఉండండి. మీ ఇంటికి ఈ రోజు అతిథిలు వచ్చే అవకాశముంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఏకాంతంలో గడుపుతారు. ప్రత్యర్థులు మిమ్మల్ని పక్కదారి పట్టించాలని చూస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రలోభాలకు లొంగకండి. మీ మంచి మనసు వలన ప్రయోజనం పొందుతారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆందోళన తప్పదు. ఉద్యోగం కోసం మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రాశి వారు ఈ రోజు హడావిడిగా ఉంటారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు ఈ రోజు సమసిపోతాయి. వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు కుటుంబంలో సభ్యులందరూ కలిసి ఆనందంగా గడుపుతారు. అధిక శ్రమ కారణంగా మీరు అలసటకు లోనవుతారు. మీరు ఎదుర్కొంటున్న చాల సమస్యలు ఈ రోజు పరిష్కారమవుతాయి. ప్రేమికులు వాగ్వాదాలకు దిగకండి. ఉమ్మడి పెట్టుబడులు పెట్టకండి, నష్టపోయే అవకాశముంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రోజు మీకు అత్యంత శుభ దినం. మీ మనస్సులో ఏర్పడిన ప్రతికూల శక్తిని నివారించండి లేకుంటే మీ పని సక్రమంగా ముందుకు సాగదు. చట్టపరమైన విషయాల్లో ఈ రోజు మీరు నిరాశ చెందవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి, అనవసర ఖర్చులకు అవకాశముంది. ఇంటికి దూరంగా ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండండి.
మకర రాశి (Capricorn)
ఈ రోజు మీకు మిగిలిన రోజుల కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది. ఉద్యోగస్తులు నూతన ఉత్తేజంతో, ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.పెట్టుబడులలో ఆచితూచి వ్యవహరించండి. లేకుంటే సమస్యలు రావచ్చు. మీరు తర్వాత పశ్చాత్తాపపడినా ఉపయోగం ఉండదు.
కుంభ రాశి (Aquarius)
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ కుటుంబంలోకి ఓ కొత్త అతిథి రావచ్చు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశముంది. దీనివల్ల కుటుంబ సభ్యులందరూ హడావుడిగా ఉంటారు, మీరు మీ తల్లిదండ్రులను ఆధ్యాత్మిక యాత్రకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, ఈ రోజు అనుకూలంగా ఉంటుంది, ఈ రోజు మీరు మీ మనసులో ఉన్న సమస్యలను షేర్ చేసుకున్నట్టయితే వాటి పరిష్కారం పొందుతారు.
మీన రాశి ( Pisces)
ఈ రోజు మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అధిక పని కారణంగా మానసిక ఒత్తిడి, శారీరక అలసట ఉంటుంది. ఈరోజు కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది, ఈ రోజు మీరు పరిచయస్తుల నుంచి ఏదైనా సలహా తీసుకోవచ్చు. విద్యార్థులు ఈ రోజు అనుకూల ఫలితాలు పొందుతారు.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది, దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.