మేష రాశి (Aries)
ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ పరంగా మంచి అవకాశాలు పొందుతారు. ఆర్ధిక, ఉద్యోగ, పురోభివృద్ధికి పలు అవకాశాలు లభిస్తాయి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొంటున్న భూవివాదాలు, వాటి సమస్యలు ఈరోజు పరిష్కారమవుతాయి. గృహ పునర్నిర్మాణం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఒక ప్రత్యేక వ్యక్తిని కలిసి వారి వల్ల ప్రయోజనం పొందుతారు. నూతన వాహన ప్రాప్తి కలదు.
వృషభ రాశి (Taurus)
ఈ రాశి స్త్రీ, పురుషులు ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు దాని గురించి పూర్తి సమాచారం తీసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే మీరు బాధపడాల్సి వస్తుంది. పెద్దలు, మత గురువుల ఆశీస్సులు పొందుతారు. అధిక శ్రమ కారణంగా మీరు కొంచెం ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి. ఈ బదిలీ ప్రయోజనకరంగా ఉంటుంది.
మిథున రాశి (Gemini)
ఈ రోజు ఈ రాశి వారికి సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. శత్రువులు మీపై విజయం సాధించే అవకాశముంది అప్రమత్తంగా ఉండండి. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలమైన రోజు. ఆర్ధిక లావాదేవీలు కలిసివస్తాయి. లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన విషయాలు, వివాదాలు ఈ రోజు పరిష్కారమై అవసరమైన ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. సోదరులతో వివాదాలు నెలకొనే పరిస్థితి ఉంది, నివారించటానికి ప్రయత్నిచండి. మిత్రులను కలిసి వారితో ఆనందంగా గడుపుతారు.
కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అత్యంత శుభదినం. సమయంతో పాటు పరిస్థితి అనుకూలంగా మారుతోంది. మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఈ రోజు సమసిపోతాయి. ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీపై ప్రజలకు గౌరవం పెరుగుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పాత వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
సింహ రాశి (Leo)
ఈ రోజు ఈ రాశి స్త్రీ, పురుషులకు అనుకూలంగా లేనందున అప్రమత్తంగా ఉండండి. మాటల్లో సంయమనం పాటించండి. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తే అవకాశముంది. ఈ కారణంగా మీ వైవాహిక బంధం బలహీనపడుతుంది. సకాలంలో పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. కన్స్ట్రక్షన్ రంగం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అత్తమామల నుండి శుభవార్తలు అందుకుంటారు.
కన్యారాశి (Virgo)
ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అవి పెద్ద మొత్తంలో ఉంటాయి. ఉద్యోగస్తులు ఈ రోజు అధిక శ్రమ కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించండి. లేదా నష్టం జరిగే అవకాశం ఉంది. అనవసర వివాదాలకు, వాదనలకు దూరంగా ఉండండి. కుటుంబ కలహాలను నియంత్రించండి. ప్రశాంతంగా పనిచేయండి.
తులా రాశి (Libra)
ఈ రాశి వారు ఈ రోజు సంయమనం పాటించండి. తొందరపాటు చర్యలను నివారించండి. ఉద్యోగస్తులు నిబంధనలు ఉల్లఘించకండి. రూల్స్ పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మిత్రులకు మీ అవసరముంటుంది, వారికి సహకరించండి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఈరోజు మీ పిల్లల కారణంగా కొంత బాధపడతారు. వారి చేష్టలతో మీరు కోపోద్రిక్తులవుతారు. బయట విహారానికి వెళ్లే అవకాశముంది.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు ఈ రాశి వారు అసంతృప్తిగా ఉంటారు. ఉద్యోగస్తులు తమ పనితో సంతృప్తి చెందరు. ఉన్నతాధికారులతో వివాదం ఏర్పడే అవకాశముంది. కనుక వాదనలకు దూరంగా ఉండండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి మరమ్మతులకు, కొత్త ఎలక్ట్రికల్ పరికరాల కోసం ధనం ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులు మంచి అవకాశాలను అందుకొంటారు. ప్రమోషన్ పొందే అవకాశముంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభ దినం. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం, పెట్టుబడులు కలిసివస్తాయి. ఆర్ధిక వృద్ధి. వ్యాపార ప్రణాళికలకు మంచి కాలం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కొంచెం ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు తమ తమ రంగంలో నిబద్ధతతో పనిచేసి విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశాలున్నాయి. స్థిరాస్తి పెట్టుబడులు కలిసివస్తాయి.
మకర రాశి (Capricorn)
ఈ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేనందున అప్రమత్తంగా ఉండండి. మాటల్లో, చేతల్లో సంయమనం పాటించండి. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు, మోసపోయే అవకాశముంది. ఉద్యోగస్తులు సహోద్యోగుల మద్దతుతో విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. ధనం వృద్ధి చెందుతుంది. తండ్రితో కొన్ని ముఖ్య విషయాల గురించి చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు మీరు ప్రశాంత సమయాన్ని గడుపుతారు.
కుంభ రాశి (Aquarius)
ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు మీ సంతాన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించండి. ప్రమాదాలు జరిగే అవకాశముంది. యంత్రాలను వాడే వారు కూడా జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా ధన వ్యయం ఉంటుంది. భూవివాదాలు, కనస్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాలు ఎక్కడివి అక్కడే ఉంటాయి. మార్పు ఉండదు.
మీన రాశి ( Pisces)
ఈ రోజు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం రిస్క్, ఉద్యోగులకు కొంత గడ్డు కాలం. కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో ఏర్పడ్డ విభేదాలు పరిష్కరించటానికి ప్రయత్నించండి. లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయి.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.