మేష రాశి (Aries)
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీ మొండి వైఖరి తగ్గించుకోండి. మీ వలన మీ చుట్టుపక్కల వారు, మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు. సన్నిహితులు మీ వైఖరితో విసిగి దూరమవుతారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. మీ ఖ్యాతి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరుల సహకారంతో పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ, సామజిక సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.
వృషభ రాశి ( Taurus)
మీకు ఈ రోజు అత్యంత శుభ దినం. మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశి స్త్రీ, పురుషులకు మీ జీవిత భాగస్వామి పూర్తి సహకారం, సాంగత్యం లభిస్తుంది. అన్యోన్యంగా గడుపుతారు. మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మిథున రాశి (Gemini)
ఈ రోజు ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండండి. మాటల్లో, చేతల్లో సంయమనం పాటించండి. పాత విషయాలు చర్చలకు తీసుకురాకండి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆఫీస్ వ్యవహారాల్లో శ్రద్ద పెట్టండి. నిర్లక్ష్యం పనికి రాదు. ఈ రోజు సమాజం లో మీ కుటుంబ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఈ రాశి వారు బహుమతులు, సన్మానాలు పొందుతారు. కుటుంబ సంబంధాల్లో సాన్నిహిత్యం ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి.
కర్కాటక రాశి (Cancer )
ఈ రాశి వారు ఈ రోజు క్రమబద్ధతతో పని చేసి విజయం సాధిస్తారు. మీకున్న ధైర్యంతో చాలా సమస్యలని ఎదిరించి పోరాడుతారు. మీకు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మద్దతు, సాంగత్యం లభిస్తుంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. అనవసర ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి. ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకండి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి .
సింహ రాశి (Leo)
ఈ రోజు మీకు శుభ దినం. మానసిక బలం పెరుగుతుంది. ఏదో తెలియని శక్తి మీలో ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రయాణానికి పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తికావడంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్యారాశి (Virgo)
ఈ రాశి స్త్రీ, పురుషులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వాటిని వినియోగించుకుంటే ప్రయోజనాలను పొందుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. జీవితంలో ఎదురైన ఆటంకాలను ఈ రోజు అధిగమిస్తారు. కుటుంబ సంబంధాలు బలపడతాయి. బహుమతులు, సన్మానాలు అందుకుంటారు. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది.
తులా రాశి (Libra)
ఈరోజు మీరు కుటుంబం కోసం సమయం కేటాయించాల్సి ఉంటుంది. కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీ విస్తృత ఆలోచనలతో వాక్చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. కుటుంబ ప్రతిష్ఠ పెరుగుతుంది. మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు ఈ రాశి స్త్రీ, పురుషులు మీ కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. వివాహితులు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. సామాజిక సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రోజు ఈ రాశి వారు వ్యాపార రంగంలో మంచి ఫలితాలను పొందుతారు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం పై శ్రద్ద పెట్టండి. నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. వైద్యులను సంప్రదించండి. వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల కొత్త వ్యాధులు బయటపడే అవకాశముంది. ఈ రోజు మీ సంతానం బాధ్యత నెరవేరుతుంది.
మకర రాశి (Capricorn)
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభ దినం. ఇప్పటి వరకు మీరు వేసుకున్న ప్రణాళికలను అమలు చేయడానికి ఈ రోజు అనుకూలమైన రోజు. మీకు అన్నిటా మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. కుటుంబ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల్లో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి.
కుంభ రాశి (Aquarius)
ఈ రోజు మీరు నూతన వ్యక్తులను కలిసే అవకాశముంది. ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి. మీ కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ద కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అనవసర హడావుడికి దూరంగా ఉండండి. మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి. ప్రయాణంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి.
మీన రాశి ( Pisces)
ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఆఫీసులో కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కానీ మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రోజు మీకు సంతానం బాధ్యత నెరవేరుతుంది. ఇతరుల సహకారం పొందడంలో విజయం సాధిస్తారు. విద్యారంగంలో కొనసాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.