మేష రాశి (Aries)
ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ రోజు అత్యంత శుభదినం. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం లభిస్తుంది. మీరు మీ ప్రియమైన వారి నుంచి ఓ పెద్ద ప్రయోజనాన్ని పొందబోతున్నారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృషభ రాశి ( Taurus)
ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టాలి. నిర్లక్ష్యంగా ఉండొద్దు. అలంకరణపై కూడా శ్రద్ధ చూపండి. ఈ రోజు మీరు కొన్ని ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని అధిగమించి పని పట్ల ఆసక్తి కనబరుస్తూ ముందుకు సాగండి. ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. అది మీకు అన్ని విధాలా ప్రయోజనం చేకూరుస్తుంది.
మిథున రాశి (Gemini)
ఈ రోజు ఈ రాశి వారికి సమయం అనుకూలంగా లేదు. అన్ని విషయాల్లో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. మాటల్లో సంయమనం పాటించండి. ఈ రోజు మీకు ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను, ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ మానసిక బలం అందుకు పూర్తిగా సహకరిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అనారోగ్య సూచనలున్నాయి, అనవసర ఆందోళనలకి దూరంగా ఉండండి.
కర్కాటక రాశి (Cancer)
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. రోజంతా ఆనందంగా గడుపుతారు. ఎక్కడైనా కానీ అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండండి. మీకు సంబంధించిన ఏ వస్తువు అయినా, ఏ విషయం అయినా వాళ్లతో పంచుకోకండి. అనుకున్న పనులు సకాలంలో నెరవేరవు. కలత చెందకండి.
సింహ రాశి (Leo)
ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేనందున మాటతీరులో సంయమనం పాటించండి. ఆరోగ్యంలో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆందోళన చెందకండి. ఉద్యోగం చేసే వ్యక్తులకు అనుకూలమైన రోజు. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో సుఖంగా ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుంది. ఈ రాశి వారికి ఆదాయం వృద్ధి చెందుతుంది.
కన్యా రాశి (Virgo)
ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ రోజు అత్యంత శుభదినం. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారానికి అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు లాభం చేకూరుస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొత్త వెంచర్లోకి ప్రవేశించడానికి ఇది మంచి సమయం. ఇది భవిష్యత్తులో చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.
తులా రాశి (Libra)
ఈ రాశి స్త్రీ, పురుషులుకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు కొన్ని విషయాల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఈ రోజు మీరు పనులలో విజయం సాధించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు, కానీ చుటూ ఉన్నవారు మీ పనికి అంతరాయం కలిగించవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టండి . మీ జీవిత భాగస్వామితో కొంత టైం స్పెండ్ చేయండి. దాని వలన మీ అనుబంధం ఇంకొంచెం బలపడుతుంది.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏదో ఒక విషయంలో మీ నుంచి సలహాలు, సహాయం ఆశిస్తారు. పాత మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. నూతన స్నేహితులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపార భాగస్వాముల మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. అన్ని విషయాల్లో సంయమనం పాటించండి. అత్యాశకు పోయి చిక్కులు తెచ్చుకోకండి. అప్రమత్తంగా ఉండండి. వేగంగా పురోగతి ఉన్నప్పటికీ మీరు నెమ్మదిగా ముందుకు సాగడానికి ప్రయత్నించండి. అన్నింట్లోను జోరు తగ్గించండి. క్రమశిక్షణతో పనులు చేస్తూ విజయం సాధించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. అనవసర విషయాల్లో ఆందోళన పడకండి.
మకర రాశి (Capricorn)
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభదినం. మీ కుటుంబంలో సంతోషకరమైన, ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. మీ స్నేహితులతో కలిసి ఔటింగ్ కి ప్లాన్ చేస్తారు. మీ ప్రణాళికలు ఫలిస్తాయి. వృత్తి, విద్యా, వ్యాపార రంగంలో ఉన్నవారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మీ మనోబలంతో వాటిని జయించి ముందుకు సాగుతారు.
కుంభ రాశి (Aquarius)
ఈ రోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీకు దొరికే ఖాళీ సమయాన్ని ఇంటిని అలంకరించడానికి, సృజనాత్మకత వైపు ఉపయోగించండి. ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్ధిక వనరులు పెరుగుతాయి. మీరు చేపట్టిన పనులన్నిటిలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు చురుకుగా పని చేయాలి. బద్ధకం వదలి చలాకీగా ముందుకుసాగితే విజయం మీ సొంతం.
మీన రాశి ( Pisces)
ఈ రోజు ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. నూతన పెట్టుబడులు, కొనుగోళ్లు, కలిసివస్తాయి. అవి భవిష్యత్తులో కూడా మంచి లాభాలు తెచ్చి పెడతాయి. భాగస్వామ్య పెట్టుబడులకు కూడా అనుకూలమైన రోజు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ వర్క్ కి సంబంధించిన ప్రయాణాల వలన ప్రయోజనం పొందుతారు. ఆహ్లాదంగా ఉంటారు.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.