మేష రాశి (Aries)
ఈ రోజు ఈ రాశి వారు కుటుంబ సమస్యలతో బాధపడే అవకాశముంది. మానసికదైర్యంతో ముందుకు సాగండి. మాటల విషయంలో సంయమనం పాటించండి. కుటుంబ సంబంధాలలో ఉద్రిక్తత, విచ్ఛిన్నం ఉండవచ్చు. వాటిని నియంత్రించండి. మీరు ఈ రోజు ప్రియమైన వారితో కొన్ని విభేదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఒక వ్యక్తి ప్రభావితం చేస్తారు. వారి మార్గదర్శకత్వంలో విజయం సాధిస్తారు.
వృషభ రాశి (Taurus)
ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు. విద్యారంగానికి సంబంధించిన పోటీలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీ పిల్లల బాధ్యత నెరవేరుతుంది. ఆర్థిక విషయాలలో విజయం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు మహిళా ఉన్నతాధికారి మద్దతు లభిస్తుంది. వివాహితులకు జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. జీవన, ఆర్ధిక పురోభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మిథున రాశి (Gemini)
మిథున రాశి వారు ఈరోజు కుటుంబ సమస్యలతో బాధపడవచ్చు. మాటల విషయంలో సంయమనం పాటించండి. చిన్న చిన్న విషయాలే ఒత్తిడికి దారితీస్తాయి. అనవసర ఆందోళనలను దగ్గరకి రానీయకండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీరు మీ పనులన్నీ దాదాపుగా పూర్తి చేస్తారు. ప్రశాంతంగా ఉండండి.
కర్కాటక రాశి (Cancer)
ఈ రాశి వారికి ఈరోజు స్నేహ సంబంధాలు కలిసి వస్తాయి. స్నేహితుల మద్దతు అన్నింటిలోను లభిస్తుంది. అన్నదమ్ముల సహకారం కూడా ఉంటుంది. బహుమతులు పొందుతారు, గౌరవం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి కారణంగా ఒత్తిడికి గురి అవుతారు. మీరు నేటి నుంచే ఆర్ధిక ప్రణాళికలు వేసుకుని వాటిని అమలు చేయాలి. భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయాలి, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు.
సింహ రాశి (Leo)
ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో విజయం పొందుతారు. వృత్తిపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర హడావుడి ఉంటుంది. మీరు సృజనాత్మక పనులలో విజయం సాధిస్తారు. కొన్ని పాత విషయాల గురించి సహోద్యోగులతో వాగ్వాదం ఉండవచ్చు, కాబట్టి జాగ్రత్తగా పని చేయడం ద్వారా వివాదాలను నివారించండి. అందరితో సఖ్యతగా మెలగండి.
కన్యారాశి (Virgo)
ఈరోజు మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి. అది మీకే మంచిది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పని పూర్తి చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ చదువులో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యకి అనుకూలమైన రోజు.
తులా రాశి (Libra)
ఈ రోజు మీరు తండ్రి వలన ఒత్తిడి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ఇబ్బందులు ఉంటాయి సంయమనం పాటించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసర గందరగోళాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల అవగాహన, శ్రద్ధ అవసరం. అదృష్ట వృద్ధి, ధనలాభం అవకాశాలు ఉన్నాయి. ఇతరుల మాటలు విని పెట్టుబడులు పెట్టకండి నష్టపోతారు.
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరుల సహకారం తీసుకోవడంలో విజయం సాధిస్తారు. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. వ్యాపారరంగంలో ఉన్నవారికి స్వంత వ్యాపారంతో పాటు భాగస్వామ్య వ్యాపారం కూడా కలిసి వస్తుంది. భాగస్వామ్య పెట్టుబడులకు ఇది మంచి సమయం, భవిష్యత్తులో కూడా లాభదాయకంగా ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు మహిళా అధికారి మద్దతు లభిస్తుంది. మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. బహుమతులు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. ఆహ్లాదకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ ప్రేమ, మద్దతు రెండింటినీ పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యకి, నూతన కోర్సులకి ఈ రోజు మంచి రోజు అన్ని విధాలా కలిసి వస్తుంది.
మకర రాశి (Capricorn)
ఈ రాశి స్త్రీ, పురుషులు ఈరోజు, మీ జీవిత భాగస్వామికి సంబంధించిన శుభవార్త వింటారు. తండ్రి లేదా మత గురువు మద్దతు పొందుతారు. సృజనాత్మక పనులలో పురోగతి సాధిస్తారు. ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. సంయమనం పాటించండి. ఏ విషయంలో అయినా దైర్యంగా ముందుకు సాగండి విజయం సాధిస్తారు.
కుంభ రాశి ( Aquarius)
ఈ రాశి వారు ఈరోజు శత్రువులపై విజయం సాధిస్తారు. మీ ముందు ఎంతటి ప్రత్యర్థి అయినా తలవంచాల్సిందే. మానసిక వేదన అనుభవిస్తారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఫలితాలు ఊహించిన దాని కంటే తక్కువగా ఉండవచ్చు. ఈ కారణంగా మీరు కొన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారస్తులు ఆచి తూచి పెట్టుబడులు పెట్టండి. తెలివిగా వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.
మీన రాశి ( Pisces)
ఈ రాశి స్త్రీ, పురుషులకు ఈరోజు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. ఈరోజు మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవసరం ఏర్పడుతుంది. దాని కారణంగా మీ జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కెరియర్ పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.